అక్షరటుడే, బాన్సువాడ : కారులో నుంచి రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండాకు చెందిన చందర్ గ్రామంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఎస్బీఐ నుంచి రూ.రెండు లక్షలు డ్రా చేసి కారులో పెట్టుకున్నాడు. కొబ్బరికాయలు కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్లి వచ్చేలోపు కారులోని నగదు ఎత్తుకెళ్లారు. ముగ్గురు వ్యక్తులు బ్యాంకు నుంచి గమనిస్తూ వచ్చి సినీ ఫక్కిలో చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొబ్బరికాయలు కొనేలోపు రూ.రెండు లక్షలు కొట్టేశారు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement