అక్షరటుడే, జుక్కల్‌: మద్యానికి బానిసైన ఆర్టీసీ డ్రైవర్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిట్లం గ్రామానికి చెందిన పత్తి కాంతయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన ఆయన రోజూ భార్యతో గొడవ పడేవాడు. బుధవారం భార్యతో గొడవపడి క్షణికావేశంలో గ్రామ శివారులోని మారేడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.