అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రూ.వెయ్యి కోసం ఒకరిని.. అతని ఆచూకీ అడిగినందుకు మరొకరిని స్నేహితులే కడతేర్చిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ అమర్‌ఖాన్, రియాజ్ ఖాన్, మహ్మద్ బహదూర్, సయ్యద్ యూసుఫ్ నలుగురు స్నేహితులు. శ్మశానాల్లో కాలిన చితిలలో బంగారు, వెండి ఆభరణాలు వెతుకుతూ గడిపేవారు. ఈ క్రమంలో ఈనెల 18న అమర్‌ఖాన్, రియాజ్‌ఖాన్, బహదూర్‌లు కలిసి బైక్‌పై ఆర్మూర్ రోడ్డుతో పాటు గూపన్‌పల్లి శ్మశానవాటికకు వెళ్లారు. ఈ క్రమంలో బహదూర్ మద్యం కోసం రూ.వెయ్యి ఖర్చు చేశాడు. అయితే, రెండు చోట్లా ఏమీ దొరక్కపోవడంతో అమర్, రియాజ్‌లు బహదూర్‌తో గొడవపడి తలపై కట్టెతో కొట్టి హత్యచేసి నీటిలో పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు మరో స్నేహితుడైన యూసుఫ్ మిగతా ఇద్దరిని బహదూర్ గురించి అడిగాడు. దీంతో హత్య విషయం బయటకు వస్తుందనే భయంతో యూసుఫ్‌ను సైతం నమ్మించి బాబన్ సాబ్ పహాడ్‌లోని జాలి తలాబ్‌కు తీసుకెళ్లారు. స్నానం చేస్తున్నట్లు నటించి అతన్ని నీటిలో ముంచి చంపేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు.
రూ.వెయ్యి కోసం స్నేహితులనే కడతేర్చారు
Advertisement
Advertisement