అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మద్యానికి బానిసై మానసిక ఒత్తిడితో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఒకటోటౌన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచమ్మగల్లికి చెందిన నరేశ్‌(40) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలలు ఉన్నారు.