అక్షరటుడే, ఎల్లారెడ్డి: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట మండలం శెట్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్ల శంకరయ్య(56) భార్య ఎనిమిదేళ్ల క్రితం పాటుకాటుతో మృతి చెందడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఐదేళ్ల క్రితం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం పురుగుల మందు తాగగా కుమారుడు గమినించి ఏరియా ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.