అక్షరటుడే, బోధన్‌: వీధి కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన బోధన్‌ పట్టణంలో చోటుచేసుకుంది. మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు సైరవిహారం చేసి పలువురిపై దాడి చేశాయి. ఈ ఘటనలో గర్భిణితో సహా 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా.. పట్టణంలో కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు జునేద్‌ అహ్మద్‌, బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వినోద్‌ ఆధ్వర్యంలో స్థానికులు పట్టణంలో ధర్నా నిర్వహించారు. సీఐ వీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు.