అక్షరటుడే, ఇందూరు: ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య కాసేపు ఆసక్తికర చర్చ జరిగింది. సోమవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో శాఖల అధికారులతో మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. మీరు అరగంట నుంచి ప్రశ్నలు అడుగుతున్నారని, వాటికి సమాధానాలు ఇచ్చేందుకు సుమారు గంట పడుతుందని.. సమావేశం చివరి వరకు ఉండాలని పేర్కొన్నారు. అలాగే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైందని, తమ ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేస్తుందో చూడాలని ఎమ్మెల్యేకు సూచించారు. కాగా.. తన నియోజకవర్గంలో సుమారు 150 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, అక్కడే కళాశాలను నెలకొల్పాలని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నవ్వుతూ అన్నారు.