అక్షరటుడే, వెబ్ డెస్క్: ముంబయిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కుర్లా వెస్ట్‌లో అదుపుతప్పిన బస్సు పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి సమయంలో అతివేగంతో తొలుత ఆటో రిక్షాను, ఆ తర్వాత పలు వాహనాలపై దూసుకెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(జోన్-5) గణేష్ గావ్డే ఈ సంఘటనను ధృవీకరించారు. మృతులను అఫ్రీన్ షా(19), ఆనం షేక్(20), కనీష్ కద్రి(55), శివం కశ్యప్(18)గా గుర్తించారు. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(50)ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ మోర్ బెస్ట్ డ్రైవర్ గా అవార్డు అందుకున్నట్టు తెలిసింది.