అక్షరటుడే, కామారెడ్డి: మద్దికుంట నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం స్టీరింగ్ రాడ్ విరగడంతో రామారెడ్డి శివారులో రోడ్డు కిందికి దిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే రామారెడ్డి పర్యటన ముగించుకొని అదేమార్గంలో కామారెడ్డి వెళ్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఘటనా స్థలం వద్ద ఆగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని డ్రైవర్ తెలపగా.. వారిని మరో బస్సులో కామారెడ్డికి పంపించాలని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు కలెక్టర్ సూచించారు.