అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: డ్రెయినేజీలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. చంద్రనగర్‌ ప్రాంతంలోని డ్రెయినేజీలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు నాలుగోటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.