అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని పూసలగల్లి లలితా అపార్ట్మెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఒకటో టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.