అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం రాత్రి సమయంలో వ్యక్తి ఆస్పత్రి ఆవరణలో పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందాడని వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 8712659837, 871259714 నంబర్లను సంప్రదించాలని వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు సూచించారు.