anasuya killing looks pics viral
anasuya killing looks pics viral
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: టీవీ యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కులకి ప‌రిచ‌య‌మై, ఇప్పుడు న‌టిగా స‌త్తా చాటుతుంది అందాల అన‌సూయ‌. జ‌బ‌ర్ధ‌స్త్ అనే షోతో అన‌సూయ‌కి మంచి పాపులారిటీ ద‌క్కింది. ఇక ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం అనే సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర అన‌సూయ కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. అనసూయ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఈమె నటించిన ప్రతి పాత్ర కూడా తన క్రేజ్ పెరగడంలో ఎంతో కొంత‌ సహాయపడిందని చెప్పవచ్చు. అందుకే స్టార్ హీరోల చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ‌కి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. బ‌న్నీ న‌టించిన పుష్ప‌, పుష్ప‌2 చిత్రాల‌లో అయితే అన‌సూయ దాక్షాయ‌ణి అనే పాత్ర‌లో డీ గ్లామ‌ర‌స్ లుక్‌లో కేక పెట్టించింది.

Anasuya: కేకో కేక‌..

బుల్లితెరకు దూరమైనా.. సినిమాలు, ఇంటర్వ్యూలతో త‌న అభిమానుల‌ని ప‌ల‌క‌రిస్తూనే ఉంటుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా నిత్యం త‌న‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అన‌సూయ పిక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతుంటారు. తాజాగా ఈ భామ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌రిచిపోతున్నారు. ఏమందం రా ఇది.. మ‌తి పోగొట్టెస్తున్నావు క‌దా అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజా పిక్స్ లో అన‌సూయ క‌సిగా చూస్తూ కిరాక్ పెట్టిస్తుంది. అన‌సూయ లుక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Anasuya : హోళీ స్పెష‌ల్ ఫొటో షూట్‌.. వెరైటీ చీర‌క‌ట్టుతో కుర్రాళ్లకి పిచ్చెక్కించిన అందాల అన‌సూయ‌

ఇక అన‌సూయ న‌టిగా ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆమె న‌టించిన చిత్రాల‌లో ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్రం’; ‘ఖిలాడీ’, ‘విమానం’, ‘పెద్దకాపు 1’, ‘రాజాకార్’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు : పార్ట్ 1’తో అలరించనుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో స్పెషల్ అప్ఫీయరెన్స్ ఇవ్వడ‌మే కాక ఆయ‌న‌తో ఓ సాంగ్‌లో చిందులేసింది. దీనికి అన‌సూయ చాలా సంతోషిస్తుంది. అలాగే తమిళంలోనూ ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వోల్ఫ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అన‌సూయ ఇప్పుడు బుల్లితెరకి పూర్తిగా దూర‌మై వెండితెర‌పై సంద‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Advertisement