అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హరిద్వార్‌లో ఈనెల 21 నుంచి 22 వరకు జరిగే అంతర్జాతీయ సదస్సుకు జిల్లాకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు, రాష్ట్ర అవార్డు గ్రహీత అందె జీవన్‌రావు ఎంపికయ్యారు. యోగాతో కృత్రిమ మేధ ఏకీకరణ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రావును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి అభినందించారు. ఈ సదస్సులో సపర్ బ్రెయిన్ యోగా – ఉన్నతమైన మేధస్సు, సమాజ క్షేమం కోసం కృత్రిమ మేధస్సు గరిష్ట ప్రయోజనం అనే అంశంపై జీవన్‌రావు మాట్లాడనున్నారు.