అక్షర టుడే, వెబ్ డెస్క్ Weather Report : గత కొద్ది రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న (Telangana) తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ (Meteorological Department) చల్లని కబురు చెప్పింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం (Weather station) వెల్లడించింది.
రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. వర్షాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Weather Report : వర్షాలే వర్షాలు..
ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకూ ఉన్న ద్రోణి (trough), చత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుపాను (cyclonic circulation) ప్రభావంతో ఈ వాతావరణ మార్పులు జరుగుతాయి. తెలంగాణలో (Telangana) ఏప్రిల్ 3 నుంచి 6 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ సహా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఇక ఏప్రిల్ 3, 4 తేదీల్లో వర్షాలు మరింత తీవ్రంగా కురిసే అవకాశం ఉంది. ఇక (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా ఆంధ్ర (NCAP), దక్షిణ కోస్తా ఆంధ్ర (SCAP), రాయలసీమలో ఏప్రిల్ 3 నుంచి 6 వరకూ విస్తృతంగా వర్షాలు పడతాయి. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు ఊపందుకుంటాయి.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణశాఖ (Meteorological Department) తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ orange హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలియజేసింది. ద్రోణి ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రానికి వర్షసూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 4, 5 తేదీల్లో వడగళ్లు పడే సూచనలు ఉన్నాయి అని అధికారులు చెబుతున్నారు.