అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొలి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశంలో భారీగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. రూ. 85,083 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు చంద్రబాబు నాయుడు అనుమతులిచ్చారు. దీంతో 33,966 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఏ కంపెనీలు అంటే..
- జేవీ నక్కపల్లి సమీపంలోని బాగరాయపేటలో సమీకృత ఉక్కు కర్మాగారం(రాజధాని పోర్టుతో సహా) స్థాపించే ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్‌తో సహా 10 భారీ పరిశ్రమలను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ ప్రారంభంలో రూ. 61,780 కోట్ల పెట్టుబడిని పెట్టి 21,000 మందికి ఉపాధి కల్పించనుంది.
- ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 5,001 కోట్ల పెట్టుబడి పెట్టమంది. 1,495 ఉద్యోగాలను సృష్టిస్తుంది.
- కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్ లిమిటెడ్ రూ. 1,430 కోట్లతో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసి 565 ఉద్యోగాలను అందిస్తుంది.
- ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ. 3,798 కోట్ల పెట్టుబడితో 200 ఉద్యోగాలను కల్పించనుంది.
- రూ. 1046 కోట్ల పెట్టుబడితో ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 2,381 మందికి ఉపాధి అందించనుంది.
వైఎస్ జగన్ హయాంలో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 1.93 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. 1.36 లక్షల మందికి ఉపాధి అందించారు.