అక్షర టుడే, కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 9, 11వ వార్డ్‌లోని లింగాపూర్‌ కు చెందిన అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ్‌ మాసోత్సవం నిర్వహించారు. తల్లులు, బాలింతలు, గర్భిణీలకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయ శంకర్ యూనివర్సిటీ విద్యార్థినులు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్‌ లక్ష్మి, టీచర్‌ పద్మ, అంగన్వాడీ టీచర్లు ఉమారాణి వైద్య, పద్మ, లలిత, కల్పన తదితరులు పాల్గొన్నారు.