Mark Shankar | తిరుమలలో పవన్​ కుమారుడి పేరిట అన్నదానం

Mark Shankar | తిరుమలలో పవన్​ కుమారుడి పేరిట అన్నదానం
Mark Shankar | తిరుమలలో పవన్​ కుమారుడి పేరిట అన్నదానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mark Shankar | ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan Kalyan) కుమారుడు మార్క్​ శంకర్ (mark Shankar)​ ఇటీవల సింగపూర్​లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్​ నుంచి పవన్​ దంపతులు కుమారుడితో సహా ఆదివారం హైదరాబాద్​ చేరుకున్నారు. కుమారుడు కోలుకోవడంతో పవన్​ సతీమని అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement
Advertisement

ఆదివారం తిరుమల (Tirumala) చేరుకున్న ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. డిక్లరేషన్​పై సంతకం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు మార్క్ శంకర్​ పేరిట సోమవారం మధ్యాహ్నం భక్తులకు(Devotees) అన్నదానం ఏర్పాటు చేశారు. దీని కోసం రూ.17 లక్షలు టీటీడీ(TTD)కి విరాళం ఇచ్చారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  mark shankar | ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కొడుకు పెద్దయ్యాక ప్ర‌పంచాన్ని శాసిస్తాడా.. ఆయ‌న జాతకం అలా ఉంది