అక్షరటుడే, వెబ్డెస్క్: Annamalai | తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై annamalai bjp రాజీనామా చేశారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. కాగా.. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. అయితే బీజేపీ, ఏఐడీఎంకే మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. వీరి భేటీ జరిగిన రెండు మూడు రోజుల్లోనే అన్నామలై రాజీనామా చేయడం గమనార్హం.
2023 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే, బీజేపీ విడిపోవడానికి కారణాల్లో అన్నామలై ఒకరని అప్పట్లో పలువురు భావించారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్నామలైని రాజీనామా చేయించాలని ఏఐడీఎంకే షరతు విధించినట్లు భావిస్తున్నారు. కాగా.. అన్నామలైకి మంచి స్థానం కల్పిస్తామని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది.