అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్వాములకు గురువారం అన్నప్రసాదం అందజేశారు. ఆలయంలో 35వ మండల పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే మండల పూజల సందర్భంగా అయ్యప్ప స్వాములకు 60 రోజుల పాటు అన్న ప్రసాదం అందుబాటులో ఉంచుతామని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, శ్రీనివాస్, రమేష్, రాజేందర్, రవికుమార్, శ్రీధర్, అంజయ్య, భాస్కర్ పాల్గొన్నారు.