
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock market | అమెరికా ప్రారంభించిన ట్రేడ్‌వార్(Trade war)తో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చైనా కూడా దీటుగా స్పందించడంతో అన్ని ఇండెక్స్‌లు భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం అన్ని దేశాల మార్కెట్లు(Stock markets) భారీగా పడిపోయాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు బేర్ ఫేజ్ దిశగా సాగుతున్నాయి. ఆల్‌టైం హైనుంచి 20 శాతానికిపైగా పతనమైన నాస్‌డాక్(Nasdaq) ఇప్పటికే బేర్ ఫేజ్‌లోకి వెళ్లిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సోమవారం అమెరికాకు చెందిన డౌజోన్స్ ఫ్యూచర్స్‌తో పాటు ఆసియా మార్కెట్లు కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్ 9.6 శాతం, హంగ్‌సెంగ్ 9 శాతం, స్ట్రెయిట్ టైవమ్స్ 6.6 శాతం, నిక్కీ 6.9 శాతం, షాంఘై 5.7 శాతం, కోప్సీ 4.5 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిప్టీ(Gift nifty) సైతం 3.9 శాతానికిపైగా నష్టంతో కదలాడుతుండడంతో మన మార్కెట్లు కూడా భారీ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించే ఆలోచన మన దేశం చేయకపోవడం, సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడంతో మన మార్కెట్లు త్వరగానే కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అనలిస్టులు భావిస్తున్నారు.
Stock market | గమనించాల్సిన అంశాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 5.6 శాతం తగ్గి 66.20 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర కూడా తగ్గుతోంది. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ 3 బీపీఎస్ పడిపోయి 4 శాతానికి చేరింది. డాలర్ ఇండెక్స్ మాత్రం 0.93 శాతం పెరిగి 103కి చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్ల కోత విషయంలో తొందరపడబోమన్న ఫెడ్ చైర్మన్ పావెల్. మన మార్కెట్లలో ఎఫ్‌ఐఐల సెల్లింగ్ కొనసాగుతోంది. శుక్రవారం నెట్ సెల్లర్లుగా నిలిచిన ఎఫ్‌ఐఐలు.. రూ. 3,484 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. ఈ వారంలో కంపెనీల Q4 ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతోంది.