
అక్షరటుడే, హైదరాబాద్: SLBC tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యమైంది. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి.
SLBC టన్నెల్‌లో 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఆరుగురి కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో మట్టి, నీరు, టీబీఎం శకలాలను తొలగించి, బయటకు తరలిస్తున్నారు.
SLBC సహాయక చర్యలపై సీఎం రేవంత్ నిన్ననే సమీక్షించారు. కార్మికుల ఆచూకీ లభించే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.