Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​

Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​
Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | దండకారణ్యం దద్దరిల్లుతోంది. పచ్చని చెట్లు, పక్షులు, జంతువుల అరుపులతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన ప్రాంతం నిత్యం తుపాకుల మోతతో మార్మోగుతోంది. దేశాన్ని మావోయిస్ట్​ రహితంగా మారుస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు నిత్యం కూంబింగ్​ చేపడుతూ మావోల ఆట కట్టిస్తున్నాయి. మంగళవారం ఛత్తీస్​గఢ్​(chhattisgarh)లోని బీజాపూర్​ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎన్​కౌంటర్(Encounter)​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు(Maoist) మృతి చెందారు.

Advertisement
Advertisement

Encounter | పరిమితమైన కార్యకలాపాలు

ఒకప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. 2004 నుంచి వారి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక వారిపై పోరును మరింత తీవ్రం చేసింది. మరోవైపు యువత మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులు కావడం లేదు. దీంతో కొత్త రిక్రూట్​మెంట్​ లేక.. పోలీసుల వేటతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను పరిమితం చేశారు. ప్రస్తుతం కేవలం ఛత్తీస్​గఢ్- తెలంగాణ సరిహద్దులోని దండకారణ్యంలో మాత్రమే వారి ఉనికి ఉంది.

Encounter | నిత్యం ఎన్​కౌంటర్లు..

గతంలో మావోయిస్టులకు దండకారణ్యం సేఫ్​ జోన్​గా ఉండేది. పోలీసులు(Police), భద్రతా బలగాలు(Security Forces) అందులోకి వెళ్లడానికి సాహసించేవి కావు. అయితే ఆధునిక సాంకేతితను వినియోగించుకొని ప్రస్తుతం పోలీసులు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిత్యం కూంబింగ్​(Coombing) చేపడుతూ ఎన్​కౌంటర్లు చేస్తున్నారు. ఈ నెల 20న జరిగిన ఎన్​కౌంటర్​లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఫిబ్రవరి 1న జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు చనిపోయారు. ఫిబ్రవరి 9న 31 మంది మృతి చెందారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Encounter | జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Encounter | మందుపాతరల వ్యూహం

సీఆర్​పీఎఫ్​(CRPF), భద్రతా బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకొని వస్తుండడంతో మావోయిస్ట్​ కేంద్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డుకోవడానికి మందుపాతరల(Landmine) వ్యూహం అమలు చేస్తున్నారు. అడవుల్లో మందుపాతరలు పెట్టి భద్రతా బలగాలను అడ్డుకుంటున్నారు. ఈ నెల 23న మందుపాతరతో పోలీస్​ వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. కాగా మావోలు దూరం నుంచే ఆపరేట్​ చేయగలిగే కొత్త రకం మందుపాతరలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఇటువంటి ల్యాండ్​మైన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement