అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vanguard | హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ప్రముఖ వాన్గార్డ్ సంస్థ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా వాన్గార్డ్ ప్రతినిధులు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. అనంతరం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
కాగా.. సంస్థ కార్యాలయం ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానుంది. ఏఐ, డేటాఅనాలిటిక్స్, మొబైల్ ఇంజినీరింగ్‌పై దృష్టి సారించనున్నారు. రానున్న నాలుగేళ్లలో 2,300 మందికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. వాన్‌గార్డ్‌తో హైదరాబాద్ స్థాయిపెరుగుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.