అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరో భారీ ఎన్కౌంటర్(Encounter) చోటు చేసుకుంది. సుక్మా జిల్లా గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు(Maoist), భద్రతా బలగాల(Security Forces) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టు పెడుతున్నాయి.
మూడు నెలల వ్యవధిలో సుమారు వంద మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2026 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit sha) ప్రకటించారు. ఈ మేరకు భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ నక్సల్స్ పని పడుతున్నాయి.