అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మరో మెగా ఐపీవో వస్తోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు చెందిన స్విగ్గీ ఐపీవో బుధవారం ఓపెన్ కానుంది. 8వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంటుంది. ప్రైస్‌బాండ్‌ను రూ. 371-390గా నిర్ణయించారు. దేశీయ మార్కెట్లనుంచి రూ. 11,327 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవోకు వస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం 3.5 శాతంగా ఉంది.