అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సుప్రీంకోర్టు చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్‌స్ట్రీమింగ్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈక్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అమలులోకి తీసుకురానున్నారు. రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. యూట్యూబ్‌ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా మహారాష్ట్రలోని సేన వర్సెస్‌ సేన కేసుపై తొలి విచారణ జరిగింది.