అక్షరటుడే, వెబ్‌డెస్క్ : liquor | మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీర్ల ధరలను(Beer prices)15 శాతం పెంచిన విషయం తెలిసిందే. బీర్ల ధరల పెరుగుదలతో ఆందోళనలో ఉన్న మందుబాబులకు లిక్కర్ ధరలు(Liquor Rates Hike) కూడా పెంచి ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మద్యం ధరలను(liquor Mrp Rates) 18 శాతం పెంచనున్నట్లు సమాచారం. బ్రాందీ, విస్కీ, జిమ్, రమ్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
liquor | సీఎం దగ్గరకు చేరిన ఫైల్
ధరల పెంపు నిర్ణయమై మద్యం వ్యాపారులు ఇటీవలే సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫైల్ రేవంత్‌రెడ్డి టేబుల్‌కు చేరినట్లు సమాచారం. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ కూడా 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవ్చని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో 18 శాతం రేట్లు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.