అక్షరటుడే, బోధన్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఓ విద్యార్థిపై మరో స్టూడెంట్‌ తల్లి దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. కళాశాలలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థుల మధ్య సోమవారం చిన్నపాటి గొడవ జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ఇరువురిని సముదాయించి పంపించివేశారు. కాగా.. మంగళవారం వీరిలో ఓ విద్యార్థి తల్లి కళాశాలకు వచ్చింది. తన కొడుకుతో గొడవ పడిన మరో విద్యార్థిని తరగతి గదిలో నుంచి బయటకు తీసుకువచ్చి దాడి చేసింది. విద్యార్థి వెంట్రుకలు పట్టుకుని లాక్కొచ్చి కొట్టింది. కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే విషయమై కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.