అక్షరటుడే, వెబ్ డెస్క్: ఎఫ్‌ఐఐల అమ్మకాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ఇరాన్‌ రూపంలో మరో పిడుగు పడేలా ఉంది. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ సుప్రీం అయతొల్లా ఖమేనీ ఇజ్రాయిల్‌, అమెరికాలకు వార్నింగ్‌ ఇచ్చారు. అప్రమత్తమైన అమెరికా.. పశ్చిమాసియాకు భారీ యుద్ధ విమానాలను, సామగ్రిని తరలించింది. ఈ నేపథ్యంలో వచ్చేవారం స్టాక్‌ మార్కెట్లలో ఒడిదొడుకులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.