HCU LANDS | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మరో అప్​డేట్​..ల్యాండ్​ పరిశీలనకు సాధికార కమిటీ

HCU LANDS | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మరో అప్​డేట్​..ల్యాండ్​ పరిశీలనకు సాధికార కమిటీ
HCU LANDS | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మరో అప్​డేట్​..ల్యాండ్​ పరిశీలనకు సాధికార కమిటీ

అక్షరటుడే, హైదరాబాద్: HCU LANDS : కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వివాదం మరో మలుపు తిరిగింది. అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు సుప్రీంకోర్టు కేంద్ర సాధికార కమిటీ(central empowered committee)ని నియమించింది.

Advertisement
Advertisement

వివాదాస్పదమైన 400 ఎకరాల భూమిలో చెట్లు మినహా జింకలు, నెమళ్లు లేవని, కృత్రిమ మేధ(AI)తో సృష్టించిన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు.

ఈమేరకు ఈ నెల 3న హైకోర్టు రిజిస్ట్రార్‌(High Court Registrar) ఆ భూములను పరిశీలించి నివేదిక పంపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  HCU land dispute | "తప్పుడు కథనాల" వ్యాప్తిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు

సిద్ధాంత్‌ దాస్‌(Siddhant Das) నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌(Hyderabad) రానున్నట్లు సమాచారం. ఈ కమిటీ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోనుంది. సంబంధిత అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించనుంది.

Advertisement