DRDO | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం!

DRDO | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం
DRDO | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DRDO | శత్రు దేశాల నుంచి మనల్ని కాపాడటానికి రక్షణ శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం మరో అడుగు ముందుకు వేసింది.

Advertisement
Advertisement

ఎంతో మంది సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పహారా కాస్తున్నారు. మరోవైపు సాంకేతికత పెరగడంతో ఇతర దేశాలు ఆధునియ ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. భారత్​ గతంలో ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. అయితే మేకిన్​ ఇండియా నినాదంతో ఇటీవల సొంతంగా అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డీఆర్​డీవో మరో అస్త్రాన్ని భారత రక్షణ కోసం సిద్ధం చేసింది.

DRDO | వాటర్​ డ్రోన్​..

శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్‌ డ్రోన్‌ను డీఆర్​డీవో విజయవంతంగా పరీక్షించింది. నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ సంస్థ దీనిని తయారు చేసింది. ఈ డ్రోన్​ ప్రయోగ పరీక్షలు సక్సెస్​ అయినట్లు అధికారులు ప్రకటించారు. ఆరు టన్నుల బరువు ఉండే ఈ డ్రోన్​ భూతల, సముద్ర జలాల్లో పని చేస్తూ శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెడుతుంది.

Advertisement