అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | ఆన్లైన్ బెట్టింగ్ Online Bettingకు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో రూ.లక్ష పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల్ gadwal జిల్లాకు చెందిన పవన్ మాసబ్ ట్యాంక్‌లోని జెఎన్టీయూ JNTUలో ఎంటెక్ M.Tech చదువుతున్నాడు.
Advertisement
బెట్టింగ్ యాప్‌లకు బానిసైన పవన్ తన బుల్లెట్ బైక్, ఐఫోన్ విక్రయించి మరి బెట్టింగ్ పెట్టాడు. ఒకేసారి రూ.లక్ష పోవడంతో మనోవేదనకు గురై అత్తాపూర్‌లోని రెడ్డి బస్తీలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement