అక్షరటుడే, వెబ్‌డెస్క్: Home Minister Anitha : ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు.
క్రైమ్ రేట్ తగ్గించాలంటే మత్తు పదార్థాలను ముందుగా అరికట్టాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే మత్తు పదార్థాల అక్రమ రవాణా కట్టడికి చర్యలు చేపట్టామని ఆమె వివరించారు. ఇందుకోసం ఈగల్ వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
అలాగే ప్రతి జిల్లాలో ఈగల్ టీమ్స్, నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. అలాగే గంజాయి సాగు చేసే హాట్ స్పాట్స్ ను గుర్తించామని, ఆయా చోట్ల నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిపారు.