అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. తానే హోంమంత్రిని అయి ఉంటే.. రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉండేదన్నారు. విమర్శలు చేసేవారిని ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై నెగెటివిటీ వస్తుందన్నారు. లా అండ్ ఆర్డర్‌పై హోమంత్రి అనిత ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలన్నారు. పోలీసులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఇటీవల ఏపీలో చిన్నారి అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే.. దీంతో పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.