అక్షరటుడే, వెబ్డెస్క్ : సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన ఆధ్వర్యంలో నరసింహ వారాహి గణం పేరుతో ప్రత్యేక విభాగాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. సనాతన ధర్మం పరిరక్షణే ఈవిభాగం లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న.. పవన్ సనాతన ధర్మం పరిరక్షణపై మాట్లాడారు. మతాలపై సోషల్ మీడియలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు, అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. సినిమా పేర్లు జపించడం కన్నా ..అభిమానులు భగవన్నామస్మరణ చేస్తే మంచిదని సూచించారు