అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఆయన మహారాష్ట్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ నడిచిన ఈ గడ్డపై అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన సిద్ధాంతమన్నారు. బాలాసాహెబ్‌ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. శివసేన, జనసేన సనాతనాన్ని రక్షించేందుకు పుట్టాయని ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. మరట్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకున్నారు.