అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఇంటి నుంచే ప్లాస్టిక్ నిర్మూలన ప్రారంభం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్లాస్టిక్ నిర్మూలన తప్పనిసరి అని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. అటవీ శాఖ ఏర్పాటు చేసి ప్రదర్శనశాలను ప్రారంభించి.. ఆసక్తిగా తిలకించారు.