అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ స్టూడెంట్స్‌ నైతిక విలువల సలహాదారు, ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 59 మందికి కేటాయించిన జాబితాలో క్యాబినెట్‌ హోదా కల్గిన ఈ కీలక పదవికి చాగంటి నియమితులయ్యారు. ఈసందర్భంగా సోమవారం చాగంటి కోటేశ్వర రావు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని విద్యాశాఖ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement
Advertisement