
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Talliki Vandanam : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు కానీ, అభివృద్ధిలో, పథకాల అమలులో మాత్రం దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ తమది ప్రజల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఏపీ అభివృద్ధే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. తాజాగా తల్లికి వందనం పథకం ప్రారంభం గురించి (CM Chandrababu) సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. (Talliki Vandanam) తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి వాళ్ల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 వేల చొప్పున డబ్బులు డిపాజిట్ చేస్తామని, ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలను అందిస్తామని ప్రకటించారు.
(Talliki Vandanam తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ రెండు పథకాల ఏపీ ప్రభుత్వ అజెండాలో కీలకంగా మారిన విషయం తెలిసిందే. అందులోనూ తల్లికి వందనం పథకం గురించి మాత్రం ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా (Talliki Vandanam తల్లికి వందనం పథకం విధి విధానాలు, డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అనే విషయాలను చంద్రబాబు వెల్లడించారు. స్కూళ్లు ప్రారంభం కాకముందే అంటే మే నెలలోనే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయం అందనుంది.
Talliki Vandanam : ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి చదివే విద్యార్థులకు సాయం
ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ప్రతి విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం అందించనుంది. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు అంత మందికి రూ.15 వేల చొప్పున సాయం అందించనున్నారు. విద్యార్థులకు ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు, విద్యార్థుల పేరెంట్స్ కు సుస్థిరతను అందించేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్య ప్రాధాన్యత తెలిసేలా ఈ పథకం విద్యను ప్రోత్సహిస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
#APGovt to Provide ₹15,000 to Each Student Under #TallikiVandanam Scheme
Key Highlights –
– ₹15,000 to each student
– Financial assistance to be given to all students in a household #ChandrababuNaidu pic.twitter.com/szNsfAdI6u
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) March 25, 2025