అక్షరటుడే, వెబ్‌డెస్క్ Peddi Reddy : ఏపీలో అధికారంలో Coalition government కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, YCP వైసీపీ నేత పెద్దిరెడ్డి Peddi Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణమైన పాలనను నేడు ఎన్నడూ చూడలేదు. అసలు కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అయినా అమలు చేసిందా? అని ప్రశ్నించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి Peddi Reddy పై విధంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే ఊసే లేదన్నారు. కొన్ని వేల కోట్ల ఫీజులు బాకీ ఉన్నాయని, వాటిని ఎప్పుడు తీర్చుతారని ప్రశ్నించారు.
Peddi Reddy : ప్రతి విద్యార్థికి చంద్రబాబు 30 వేల బాకీ
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చంద్రబాబు Chandrababu రూ.30 వేల రూపాయల బాకీ ఉన్నారు. అవి ఎప్పుడు తీర్చుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. ఆ విషయంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి జిల్లాలో వైసీపీ YCP యువత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని పెద్దిరెడ్డి Peddi Reddy స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు: పెద్దిరెడ్డి
ఇంత దారుణమైన పరిపాలన ఎన్నడూ చూడలేదు
10 నెలలు అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసే లేదు
ప్రతి విద్యార్థికి చంద్రబాబు రూ.30 వేల రూపాయల బాకీ ఉన్నారు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాల్లో… pic.twitter.com/boCIAQwobY
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025