అక్షరటుడే, వెబ్డెస్క్ : Liquor scam | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ YCP హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ Liquor scam దర్యాప్తులో సిట్ SIT వేగం పెంచింది. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి Raj Kasirreddy ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ Hyderabad లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఏపీ సిట్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 15 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి.
ఈ స్కామ్లో ప్రధాన నిందితుడైన కసిరెడ్డి కొద్దిరోజులుగా అధికారులకు అందుబాటులో లేరు. ఇప్పటికే అధికారులు విచారణకు రావాలని మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన స్పందించలేదు. ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిట్ అధికారులు హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో దాడులు చేశారు. కాగా.. కసిరెడ్డి మాజీ సీఎం జగన్ Jagan బంధువు. కసిరెడ్డి kasi reddy మద్యం తయారీ దారుల నుంచి రూ. 60 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.