అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ ఒప్పందాలపై విచారణ జరిపించాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి జరిగితే మరో దేశంలో బయటపడిందని, మనదేశంలో అవినీతిని బయటపెట్టే సంస్థలు లేవా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో యూనిట్ విద్యుత్ రూ.1.99 ఉంటే జగన్‌ రూ.2.49కి విద్యుత్‌ కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో సోలార్‌ విద్యుత్‌ ధర తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయేది రాష్ట్ర ప్రజలే కానీ, అదానీ, జగన్‌ కాదన్నారు.