Advertisement

అక్షరటుడే, ఆర్మూర్:

Advertisement
పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల పని చేసేందుకు మహిళా అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రిక తెలిపారు. చరిత్ర, స్టాటిస్టిక్స్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను తీసుకొని కళాశాలలో మంగళవారం ఇంటర్వ్యూ, డెమోకు హాజరు కావాలన్నారు. పీహెచ్ డీ, నెట్, సెట్, బోధన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.