అక్షరటుడే, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా మరో 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపింది. ఈ సర్వీసులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండబోవని చెప్పింది. ఎంజీబీఎస్‌లో రద్దీ తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కొన్ని మార్పులు చేశామని వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్ బస్సులను పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement