అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత్ – చైనా సంబంధాలు మళ్లీ మెరుగు పడుతున్నాయా.. అంటే అవుననే తెలుస్తోంది. రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఇరు దేశాల సరిహద్దులు సమస్యలు పరిష్కరించబడటంతో డ్రాగన్ సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. తాజాగా బ్రెజిల్ లో జరుగుతున్న జీ-20 సదస్సులో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడిపించే దిశగా కసరత్తు జరుగుతోంది. మానస సరోవరం యాత్ర సైతం పున ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ – చైనా మంత్రి వాంగ్ యీ ఈ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.