
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Vastu Tips : మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా ఈ ఒక్క పని చేశారంటే వాస్తు దోషం తొలగిపోతుంది. వాస్తు దోషము నివారణకు మీ ఇంట్లో పురాణ గ్రంథాలు చెప్పిన ప్రకారం. హిందూమతంలో నెమలి పించం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ నెమలి పించం కృష్ణయ్యకు ఎంతో ఇష్టం. నెమలి ఈకకు వాస్తు శాస్త్రములో విశిష్టమైన స్థానం ఉంది.మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరే ఇతర సమస్యలు ఉన్న ఈ మూలలో నెమలి(పించం) ఈకను ఉంచండి. ఈ నెమలి ఈక మతపరమైన దృక్కోణం నుంచి మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్ర దృక్కోణంలో కూడా మంచి ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా ఈ నెమలీక తోటి ఆ దోషాలను తొలగించవచ్చు.
మరి ఈ నెమలీకను ఇంట్లో పెట్టుకునే ముందు కొన్ని వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. మన హిందూ ధర్మంలో పురాణ గ్రంథాలు, ప్రకృతికి సంబంధించిన కొన్ని వస్తువులు దేవతలు ధరించేవారు. ఇవి మానవ జీవితానికి కూడా ఎంతో శుభప్రదం. అందులో ఒకటి నెమలి ఈక. ఈ నెమలి ఈక శ్రీకృష్ణుని తలపై ఎంతో అందంగా అలంకరించబడి కనిపిస్తుంది. ఆ కృష్ణునికి నెమలి పించం ఎంతో ప్రీతికరం. శ్రీకృష్ణుడే ధరించిన ఆ నెమలి పించం. ఇంట్లో ఉంటే మనకున్న సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇంట్లో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు, సంపదలను తెస్తాయని వాస్తు పండితులు సలహాలు ఇస్తున్నారు.
అంతేకాదు, నెమలి పించం ఇంట్లో ఉంటే దంపతులు మధ్య వివాదాలు కూడా తొలగిపోతాయి. రెండు నెమలి ఈకలను మీ పూజ గదిలో కలిపి ఉంచటం వల్ల వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ నెమలి ఈకలను ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. నెమలి ఈకలను మీ ఇంటి ప్రధాన తూర్పు ద్వారం వద్ద. తరం లేదా ఈశాన్య వంటి దిశల్లో లేకుంటే లేదా ప్రధాన ద్వారంలో ఏదైనా వాస్తు లోపం ఉన్నా, ఆ ఇంటి ప్రధాన ద్వారం తలుపులపై కూర్చున్న గణేశుని ప్రతిష్టించాలి.గణపతి తల పైన మూడు నెమలి ఈకలను ఉంచండి. మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవి పరిష్కరించబడతాయి.
క్లపక్షంలో ఆగ్నేయ మూలంలో కనీసం 5 అడుగుల ఎత్తులో రెండు నెమలి ఈ కలయించడం వల్ల డబ్బు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్ అంటే హాల్లో 11, 15 లేదా అంతకంటే ఎక్కువ నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల కుటుంబ సమస్యల మధ్య పరస్పర సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమాభిమానాలు పెరుగుతాయి.మీ ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో నెమలి ఈకలు కూడా సహాయపడతాయి. మీరు నెమలీకలు ఉంచిన ప్రదేశంలో చుట్టూరా ఎటువంటి కీటకాలు కూడా దరి చేరవు.