Summer : వేస‌విలో నీటిని ఇలా తాగుతున్నారా.. అయితే ..మీరు డేంజర్ లో ఉన్నట్లే…?

Summer : వేస‌విలో నీటిని ఇలా తాగుతున్నారా.. అయితే ..మీరు డేంజర్ లో ఉన్నట్లే...?

అక్షర టుడే, వెబ్ డెస్క్ Summer : వాటర్ ని తాగేటప్పుడు ఎలా తాగాలి అనే విషయం ఎవరికీ తెలియదు.నిటిని తాగే విషయంలో కూడా తగు జాగ్రత్తలను పాటించాలి అని అంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండడానికి నీరు ఎంత అవసరమో.. మనం రోజు తగినంత నీరు తాగడం సరైన పద్ధతిలో తాగటం కూడా అంతే అవసరం. ఒకవేళ ఎలా పడితే అలా వాటర్ ని తాగినట్లయితే మీరు చిక్కుల్లో పడిపోతారు. మీ శరీరంకు డిహైడ్రేషన్ సమస్య, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండుటకు,ఇంకా సరైన బరువును నిర్వహించడానికి ఈ విషయం గురించి తెలుసుకోండి… కొంతమంది నీటిని ఎక్కువగా తీసుకుంటూనే ఉంటారు. కానీ వారిలో కూడా కొన్నిసార్లు శరీరంలో డిహైడ్రేషన్ సమస్య తలెత్తుతూ ఉంటుంది.

Advertisement
Advertisement

రోజుకు తగినంత నీరు తాగకపోతే శరీరంలో మూత్రపిండాల సమస్యలు, డిహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండడానికి, శరీర బరువును నిర్వహించడానికి రోజు కనీసం 3 లీటర్ల నీరు అయిన తాగడం అవసరమని చెబుతున్నారు నిపుణులు. నీటిని ఏ విధంగా తాగాలి : ఈ నీటిని తీసుకునే క్రమంలో సరైన నియమాలు పాటించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే వివిధ శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది దాహం వేసినప్పుడు, ఎండ వేడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వెంటనే డీఫ్రిజిరేటర్ నుంచి చల్లని నీటిని తీసుకొని తాగుతుంటారు.

ఈ విధంగా బయటి నుంచి రాగానే డీప్రిజిరేటర్ నీటిని వెంటనే తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. వేడిలో అసౌకర్యంగా అనిపిస్తే, అది ఉష్ణోగ్రత వద్ద కొద్ధిసేపు కూర్చుని ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ నీటిని తాగాలి. కొంతమందికి భోజనం చేసేటప్పుడు నీళ్ళని తాగే అలవాటు ఉంటుంది. ఈ సమయంలో కడుపు నుంచి వివిధ రసాలు శ్రమిస్తాయి. ఇవి తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తాయి. ఇటువంటి సమయంలో ఎక్కువ నీరును తీసుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా కడుపుబ్బరం, వికారం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరుగుతాయి. మీరు వాటర్ ని బాటిల్ నుంచి కాకుండా గ్లాస్ నుంచి నీరు నీ తాగితే మంచిది.

ఇది కూడా చ‌ద‌వండి :  Badam Milk : ఎండాకాలం కదా అనీ బాదంపాలు తెగ తాగుతున్నారా.. అయితే ,ఇది మీకోసం...?

నీతిని తాగేటప్పుడు ఒకే చోట కదలకుండా కూర్చోవాలి. నడుస్తున్నప్పుడు లేదా అస్థిరంగా ఉన్నప్పుడు నీరు తాగి ప్రయత్నాలు చేయవద్దు. దీనివల్ల మీ గొంతు, ముక్కులో నీరు పోయే ప్రమాదాలు ఎక్కువే. దీనినే పోలమారుట అని అంటారు. దీనివల్ల మీకు అసౌకర్యంగా ఉండవచ్చు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగితే మంచిది. పళ్ళు తోముకునే ముందు నీళ్లు తప్పక తాగాలి. ఈ అలవాటు గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. భోజనానికి కనీసం 30 నిమిషాల ముందు, భోజనం చేసినాక ఒక గంట తర్వాత నీరు తాగితే ఉత్తమం. మరి నీటిని నిలబడే తాగాలా, కూర్చొని తాగాలా అని సందేహం కలగవచ్చు. నీటిని నిలబడి తాగడం కంటే కూర్చొని తాగడం మంచిది. ఎండ నుంచి రాగానే నిలబడి వాటర్ ని తాగవద్దు. కొద్దిసేపు కూర్చొని, ఆ తర్వాత నీటిని తాగాలి.

Advertisement