శనివారం రోజు మాంసం భుజిస్తున్నారా..? తింటే ఏమవుతుంది…? మన పూర్వీకులు చెప్పిన విషయాలు తెలిస్తే మతిపోతుంది..?

శనివారం రోజు మాంసం భుజిస్తున్నారా..? తింటే ఏమవుతుంది...? మన పూర్వీకులు చెప్పిన విషయాలు తెలిస్తే మతిపోతుంది..?
శనివారం రోజు మాంసం భుజిస్తున్నారా..? తింటే ఏమవుతుంది...? మన పూర్వీకులు చెప్పిన విషయాలు తెలిస్తే మతిపోతుంది..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ : సాధారణంగా ప్రజలలో భక్తి విశ్వాసాలు పెరగడం చేత. కొందరు కొన్ని వారాలు మాంసాహారాన్ని ముట్టము అని పెట్టుకుంటారు. అందులో కొందరు సోమవారం, మరి కొందరు మంగళవారం, మరికొందరు శుక్రవారం, ఇంకా, కొందరు శనివారం నాడు మాంసాహారాన్ని ముట్టమూ అని వారాలను పాటిస్తారు. అయితే,దీని వెనుక శాస్త్రీయంగా కారణం ఉందని నివేదికలో తెలియజేశారు. శనివారం నాడు మాంసాహారం అస్సలు ముట్ట వద్దని ఇంట్లో పెద్దవాళ్లు పురాతన కాలం నుంచి ఇప్పటివరకు చెబుతూనే ఉన్నారు. ఎందుకు శనివారం నాడు మాంసాహారం ముట్టవద్దు అని నియమం వచ్చింది. మాంసాహారాల పై అనేక విమర్శలు ఉన్నప్పటికీ, శాస్త్రీయంగా శాఖాహారాలలో లేని పోషకాలు, మాంసాహార ఆహారాలలో ఉన్నాయని సైన్స్ చెపుతుంది. మాంసాహారాలలో కొన్ని ప్రోటీన్లు, కొన్ని ఇతర పోషకాలు కూడా కలిగి ఉంటాయి. వీటిని మీరు ప్రతిరోజు కూడా మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మాంసాహారం : మాంసాహారాలని ఎవరు ఇష్టంగా తినరు చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలు వేసుకొని మరీ తింటారు ఈ మాంసాహారాన్ని. చికెన్, చేపలు వంటి వంటకాలు చాలా రకాలుగా ఉంటాయి. ఎంతో రుచిని ఇవ్వటమే కాదు ఆరోగ్యాన్ని కూడా అంతే ఇస్తుంది. కాబట్టి ఈ మాంసాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇష్టమైన ఆహారం కూడా.చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, చిల్లి చికెన్, చికెన్ పెప్పర్ డ్రై, చికెన్ లాలీపాప్, చికెన్ మంచూరియన్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ పులుసు, మటన్ ఫ్రై, మటన్ చాప్స్, మటన్ కీమా, ఫిష్ ఫ్రై, చాపల పులుసు, ఫిష్ కబాబ్ వివిధ రకాల మాంసాహారం వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇష్టంగా వండుకొని తింటూ ఉంటారు. బయట మార్కెట్లలో వంటకాలు ఎన్నో లభిస్తాయి. ఆదివారాలలో సెలవు వస్తే చాలా మంది మాంసాహారం కొనుగోలు చేస్తారు. సాధారణ రోజుల్లో కంటే కూడా షాప్స్ లలో ఎక్కువ ఉండడం మీరు గమనించవచ్చు. అన్ని వారాలలోకెల్లా ఆదివారమే ఎక్కువ మాంసాహారాన్ని భుజిస్తారు.

శనివారం మాంసాహారం ఎందుకు భుజించరు : శనివారం రోజు మాంసాహారాన్ని ఎందుకు భుజించరు అంటే, భారతదేశంలో శాంతి పర్వం మాంసం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరంగా వివరించారు. మాంసాహారాన్ని తీసుకోకపోవడం అహింస 4 ప్రధాన సూత్రాలలో ఒకటి. ఒక జీవిని బలిచి ఆ మాంసాన్ని ( అసాధారణ అత్యవసర పరిస్థితులు) లలో తప్ప, ఏ రోజునైనా అన్ని రకాల మాంసాలు నిషేధించబడ్డాయి. అంతేకాదు, మాంసాహారం తిన‌డం పాపంగా కూడా పరిగణించబడతాయి. ఇటీవల నిదిష్ట రోజుల్లో తినకూడదని ఈ సత్వమార్గ సూత్రం.మాంసం తినడానికి అనుమతి ఉన్నా కూడా కొన్ని ప్రదేశాల్లో స్థానిక సంప్రదాయాలు ఆచారాలు కూడా ఉన్నాయి.

బెంగాలీ హిందువులు, గురువారం నాడు మాంసాహారం అస్సలు భుజించరు. ఎందుకంటే ఆరోజు భగవతీ లక్ష్మీ పవిత్రమైనదని నమ్ముతారు. సోమవారం శివునికి, మంగళవారం ఆంజనేయునికి, బుధవారం గణేశునికి, గురువారము భగవతీ లక్ష్మీదేవికి ఇంకా గురు సాయినాదుడుని పూజిస్తారు , శుక్రవారం నాడు మహాలక్ష్మి దేవికి, వెంకటేశ్వరునికి, ఇంకా నారాయుడిని భక్తితో పూజిస్తారు. కాబట్టి ఈరోజుల్లో దేవులకి ఈ వారాలను అంకితం చేశారు కాబట్టి. పవిత్రమైన రోజులుగా భావించి శనివారం నాడు మాంసాహారాన్ని ముట్టరు కొందరు. ఆదివారం నాడు అందరికీ సెలవు కారణం చేత, ఆ రోజు అందరూ సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి మాంసాహారాన్ని భుజిస్తారు.

Advertisement