
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Beetroot – Carrot Juice : మనం ప్రతిరోజు కూడా తినే ఆహారాలలో పండ్లు, కూరగాయలు తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే తాజా పండ్లు, కూరగాయలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తాజాగా తీసుకుంటే అవి మనకి అందుతాయి. అలాగే రుచి కూడా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పండ్ల రసాలను తీసుకుంటే అందంగా కనిపిస్తాం. కూరగాయలతో చేసిన రసాలు కూడా మంచివే. ఇది ఆరోగ్యంగా ఉంచడానికి ఇంకా,శరీర చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. ఎండాకాలంలో జూస్ లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ద్రవపదార్థాలనే ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎండాకాలంలో జ్యూసులు తాగితే మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.
ఈ రసాలను తాగడం చేత శరీరం అతి త్వరగా పీల్చుకొనేలా చేసుకుంటుంది. ప్రతి రోజు, ఎవరు ఎంత పనిలో నీలమైపోయిన సరే ఒక గ్లాస్ జ్యూస్ తాగారంటే ,శరీరానికి ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు నిపుణులు. అలాంటి జ్యూసులు అయినా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ లు.ఎండాకాలంలో ఈ జ్యూస్ లు ఎందుకు తాగాలో తెలియజేస్తున్నారు నిపుణులు… ఎండాకాలంలో ఎండ తీవ్రతకు మన శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. అలాగే ,చర్మం ఆరోగ్యం పాడవుతుంది. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలన్న మంచి పోషకాలు పొందాలన్నా ఈ జూసులు తాగడం ఎంతో అవసరం. జూసులు అనగా ముందు వరుసలో ఉండే జ్యూస్ లు బీట్రూట్, క్యారెట్.
ఈ బీట్రూట్ క్యారెట్ లో ఉండే రంగు తాజాదనమే దుంపలలో కూడా ఉంటుంది. క్యారెట్ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ లో అధికంగా ఉంటాయి. విటమిన్ సి వృద్ధాప్యం, ముడతలు లేకుండా ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుండగా, బీటా కెరోటిన్ చర్మ మంటను నివారిస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే బౌల్ మూమెంట్ ని మెరుగుపరిచి పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఈ దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మానికి ప్రకాశంవంతంగా మార్చుతుంది. వృద్ధాప్యాచాయలను దరిచేరనివ్వదు. ఇవి రోజు సమ్మర్ లో ఈ జ్యూస్ ని గనక తాగితే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.
బీట్రూట్, క్యారెట్ జ్యూస్ లా ప్రయోజనాలు : ఎండాకాలంలో ఈ జ్యూసులు తాగితే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మినరల్స్ అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇందుకు క్యారెట్ల రసం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.ఏ సీజన్లో అయినా సరే, సీజన్ మారుతున్న సమయంలో కొన్ని రకాల వ్యాధులకు గురవుతాము. అయితే, ఎండాకాలంలో మిమ్మల్ని మీరు ఫీట్ గా ఉంచుకొనుటకు చాలా కష్టమైన పని. వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు తమను తాము బాగా రక్షించుకోవాలి. రోజు ఆహారంలో కొన్ని జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. క్యారెట్లలో విటమిన్ ఎ, బి,ఇ, కాల్షియం,ఫైబర్,ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
మరోవైపు దుంపలలో ఇనుము,సోడియం, పొటాషియం,ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇది సహజ చెక్కరలను కలిగిన మూలం. కూరగాయల రసాలని కలిపితే శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలియజేశారు. బీట్రూట్,క్యారెట్ జ్యూస్ శరీరంలో ఇక బరువు పెరగకుండా కాపాడుతుంది. రోజు ఈ రెండు కలిపిన బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చని చెబుతున్నారు. జ్యూస్ లో తక్కువ కేలరీలు,ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున, జ్యూస్ తాగితే బరువు త్వరగా తగ్గవచ్చు. కొందరు ఎండాకాలంలో కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి బీట్రూట్,క్యారెట్ల జూస్ ఎంతో మేలు చేస్తుంది. ఈ జీర్ణ సమస్యలను సులభంగా నయం చేస్తుంది. జీర్ణ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఫైబర్ ఉండడం చేత జీర్ణ క్రియ కు సహాయపడుతుంది.
మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. బీట్రూట్, క్యారెట్ రసం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండుట చేత రక్తపోటును అదుపులో ఉంచగలదు. ప్రతిరోజు గనక దీనిని తాగితే అతి కొద్ది రోజుల్లోనే కోలుకుంటారు. ముఖ్యంగా శరీరంలో రక్తహీనత లోపిస్తే, అటువంటివారు బీట్రూట్, క్యారెట్ రెండు కలిపిన జ్యూస్ ని తీసుకుంటే, రక్తహీనత లోపాన్ని పూరించవచ్చు. దినివల్ల రక్తం వృద్ధి చెంది ఎనిమియా అనే వ్యాధి రాకుండా కాపాడుతుంది. శరీరంలో రక్తం త్వరగా తయారు కావాలంటే బీట్రూట్,క్యారెట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇందులో ఇనుము మంచి మూలం. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఇతర సమస్యల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.